EVM with VVPAT will be used in upcoming 5 State Assembly Elections

5 State Elections are going to be held in November and December 2018. Many people and political parties are raising doubts on EVM machines. Election Commission of India trying to clarify all the doubts about functionality of EVM machines but some people are claiming that it can be hacked in 10-15 minutes. ECI has given open challenge to hack the EVM machines which will be provided by ECI. All these issues were raised since years.

Now VVPAT is being implemented for EVM, with this feature the voter can come to know for party his vote polled. VVPAT machine will display the paper for 7 seconds about the party symbol which voter voted for later it will be dropped into the attached box of VVPAT.

EC should give opportunity for the candidates who are going to ask for recounting based on VVPAT for any specific Polling station or entire constituency. Count in the EVM and VVPAT should remain same. If such recounting incidents happens and if the results remain same than doubts from the minds of people about EVM will go off.

Let’s hope ECI will take necessary actions to protect the interests of Voters.

కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఉన్న శ్రద్ధ పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఎందుకు లేదు?

తెలంగాణ ప్రభుత్వం ప్రతి వారం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏదో ఒక ప్యాకేజీ పనుల మీద సమీక్షలు జరుపడం, క్షేత్రస్థాయిలో పరిశీలన చెయ్యడం చేస్తుంది. ఇది ఒక ఇంజనీరింగ్ అద్బుతం అంటూ ప్రకటనలు కూడా ఇస్తుంది. ప్రాజెక్ట్ నిర్ణీత సమయంలో పూర్తి చెయ్యాలి అనుకోవడంలో తప్పు లేదు కానీ మిగతా ప్రాజెక్టుల విషయంలో అల జరగక పోవడం బాధాకరం.

కరువు జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగా రెడ్డి జిల్లాలకు సాగునీరుతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీరు కోసం జూన్ 11 వ తారీఖు 2015 నాడు తెలంగాణ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 35000 వేల కోట్ల రూపాయల అంచనాతో శంకుస్థాపన చెయ్యబడిన ప్రాజెక్ట్ నేటికీ ఎంత మేరకు పూర్తి అయ్యింది?

కేసులు విషయం చెప్పి తప్పించుకునే ధోరణి ఏ విధంగా సమర్థనీయం? కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా మల్లన్న సాగర్, కొండ పోచమ్మ రిసర్వాయార్ విషయాల్లో కూడా కోర్టు కేసులు ఉన్నాయి.

గత నాలుగు సంవత్సరాలుగా పాలమూరు లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదు? వీటికి ఎవరు అడ్డం పడుతున్నారు?

మొట్ట మొదటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో పాలమూరు లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తాం అని ప్రకటించారు. ఇప్పటి వరకు ఎందుకు కాలేదు?

పట్టాదారు పాసు పుస్తకం అనేది రైతు హక్కు – రైతు బందు అనేది సంక్షేమ పథకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర భూమి రికార్డుల నవీకరణ. ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్నో ఏళ్లుగా ఉన్న చేతి రాత రికార్డులకు చరమ గీతం పాడుతూ బ్యాంకుల తరహాలో ఎప్పటికప్పుడు అమ్మిన, కొన్న భూముల లావాదేవీలను నూతనంగా ఏర్పాటు కాబోతున్న ధరణి లో పొందుపరిచి అన్ని రకాల వ్యవసాయ భూముల క్రయ విక్రయాలను ఇక్కడే జరిగేలా ఏర్పాటు చెయ్యడానికి నిర్ణయించడం జరిగింది.

ప్రభుత్వం నుండి వెలువడిన సూచనల ప్రకారం ఏదైనా భూమి వివాదంలో ఉంటే దానిని వివాదాలు గల భూములుగా నమోదు చెయ్యాలని నిర్ణయించారు. డిసెంబర్ 2017 చివరి నాటికి ఎటువంటి వివాదాలు లేని, వివాదాలు గల భూములను గుర్తించారు. వివాదాలు లేని భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు మరియు రైతు బందు చెక్కులను కూడా ఇవ్వడం జరిగింది.

మరి వివాదంలో ఉన్న భూముల సంగతి మరియు ఆ రైతుల హక్కుల సంగతి ఎంటి అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. సివిల్ కోర్టు వివాదాలు, రెవెన్యూ కోర్టు వివాదాలు, కుటుంబ వివాదాలు, అడవి భూముల వివాదాలు, అసైన్డ్ భూముల వివాదాలు ఇలా రకరకాల వివాదాలు నమోదు చేశారు. అడవి భూములను, అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తో సమస్య సమసిపోయే అవకాశం ఉంది. కానీ మిగిలిన వివాదాలు తేల్చడం అనేది ప్రభుత్వం పరిధిలో లేదు ఎందుకనగా

1. సివిల్ కోర్టు లో ఉన్న భూములకు సంబంధించి జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా కోర్టు, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు దాకా వెళ్లే అవకాశం ఉంది. చివరి జడ్జిమెంట్ వచ్చే వరకు ఆ భూముల పరిస్తితి ఎంటి? ఎన్ని దశాబ్దాలు పట్టాలి కోర్టు నిర్ణయం రావడానికి??

2. రెవెన్యూ కోర్టులో ఉన్న భూములకు సంబంధించి తహశీల్దారు కోర్టు, RDO కోర్టు, జాయింటు కలెక్టర్ కోర్టు, CCLA కోర్టు. వీటిలో ఏ దశలో అయిన కేసు సివిల్ కోర్టు పరిధిలోకి వెళ్ళవచ్చు. అప్పటి వరకు ఆ భూముల మరియు సాగు చేసే రైతుల పరిస్తితి ఎంటి?

ఎటువంటి వివాదాలు లేని భూములకు మాత్రమే రైతు బందు పథకం వర్తింపచేసిన ఇబ్బంది ఉండకపోవచ్చు ఎందుకంటే అది ఒక సంక్షేమ పథకం కానీ హక్కు దారులకు వివాదం అయిన పొలం అనే కారణం చేత హక్కు పత్రాలు ఇవ్వక పోవడం అనేది సరియైనది కాదు.

రెవెన్యూ కోర్టు, సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు మార్పులు చేసే అవకాశం ఉన్నప్పుడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వకపోవడం దారుణం.

రేవంత్ రెడ్డి ఒక్కడే పార్టీలు మారాడా? మరి మిగతా వాళ్ళ సంగతి?

రేవంత్ రెడ్డి తెలుగదేశం పార్టీకీ రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అతను ఎన్ని పార్టీలు మారాడు అనే చర్చకు తెరలేపారు.

మొదట్లో తెలంగాణ రాష్ట్ర సమితి

తర్వాత తెలుగు దేశం పార్టీ

ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్

తమ రాజకీయ అవసరం కోసం ప్రతి రాజకీయ నాయకుడు చేసే పని తమకు అనువయిన వేదిక కోసం పాకులాలడం.

కల్వకుంట్ల చంద్రశేఖర రావు: ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కానీ రాజకీయ ఓనమాలు కాంగ్రెస్ పార్టీలో నేర్చుకొని తెలుగు దేశం పార్టీలో దశాబ్దాల పాటు ఉన్న వ్యక్తే కదా.

నారా చంద్రబాబు నాయుడు: ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ లో రాజకీయ ఆరంగేట్రం చేసి మంత్రిగా పనిచేసిన ఆయన ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.

ప్రస్తుతం ప్రజాసేవ కోసమే మేము రాజకీయాలలో ఉన్నాం అని ఎవరు చెప్పినా అది సత్యదూరం.

ప్రజల మద్దతు పొందినంత కాలం వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేడు కత్తులు దూసిన నాయకులు రేపు ఆత్మీయ ఆలింగనాలూ చేసుకుంటారు.

నాడు పచ్చ కండువా వేసుకొని తిట్టిన వ్యక్తి నేడు గులాబీ ప్రభుత్వంలో మంత్రి

ఇప్పుడు రేవంత్ కూడా అంతే, అప్పుడు భలి దేవత అని సంబోధించి ఇప్పుడు అదే పార్టీలో చేరుతున్నారు, ఎవరి అవసరం వారిది.

Telangana RTA m-wallet enhanced to pay challans on your vehicle

While launching RTA m-wallet had a feature to add your Driving License and Registration certificate of your vehicle.

Now they added another feature to pay challans if any on your vehicle.

Step1: Login into RTA m-wallet

Step2: Add your vehicle RC by entering vehicle registration number and last 5 digits of chasis number.

Step3: After RC added, click on vehicle number. You would find ‘ view pending challans’

Step4: Click on View Pending Challans

If you find any challan against your vehicle, you can make payment by clicking on “PAY NOW”.

Step5: You can also find all Challans history, by clicking on ‘Challans History’ in the same screen. Here is History

Govt is spending more than 1500 crores for Lucky Grahak Yojana

lgy

Govt of India, Niti Aayog annouced “Lucky Grahak Yojana” for the customers who are making digital transactions. They will pick 15000 members daily and award 1000 INR per member for hundred days. Which will cost just 1500 crores. On top of it, Weekly and Bumper Prize amount is extra.

lgy-pmo

Who’s money it is?

Why govt is encouraging it? 

With these 1500 crores they can spend on rural development. At least 1500 villages can be covered for Electricity, Drinking water, Education etc.