రేవంత్ రెడ్డి ఒక్కడే పార్టీలు మారాడా? మరి మిగతా వాళ్ళ సంగతి?

రేవంత్ రెడ్డి తెలుగదేశం పార్టీకీ రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అతను ఎన్ని పార్టీలు మారాడు అనే చర్చకు తెరలేపారు.

మొదట్లో తెలంగాణ రాష్ట్ర సమితి

తర్వాత తెలుగు దేశం పార్టీ

ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్

తమ రాజకీయ అవసరం కోసం ప్రతి రాజకీయ నాయకుడు చేసే పని తమకు అనువయిన వేదిక కోసం పాకులాలడం.

కల్వకుంట్ల చంద్రశేఖర రావు: ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కానీ రాజకీయ ఓనమాలు కాంగ్రెస్ పార్టీలో నేర్చుకొని తెలుగు దేశం పార్టీలో దశాబ్దాల పాటు ఉన్న వ్యక్తే కదా.

నారా చంద్రబాబు నాయుడు: ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ లో రాజకీయ ఆరంగేట్రం చేసి మంత్రిగా పనిచేసిన ఆయన ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.

ప్రస్తుతం ప్రజాసేవ కోసమే మేము రాజకీయాలలో ఉన్నాం అని ఎవరు చెప్పినా అది సత్యదూరం.

ప్రజల మద్దతు పొందినంత కాలం వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేడు కత్తులు దూసిన నాయకులు రేపు ఆత్మీయ ఆలింగనాలూ చేసుకుంటారు.

నాడు పచ్చ కండువా వేసుకొని తిట్టిన వ్యక్తి నేడు గులాబీ ప్రభుత్వంలో మంత్రి

ఇప్పుడు రేవంత్ కూడా అంతే, అప్పుడు భలి దేవత అని సంబోధించి ఇప్పుడు అదే పార్టీలో చేరుతున్నారు, ఎవరి అవసరం వారిది.

Leave a comment