బిరబిరా కృష్ణమ్మ తరలిపోయిన కథ!

Random Thoughts

Bheema Project
ఆంధ్రలో నిండిన రిజర్వాయర్లు.. పండిన పంటలు
తెలంగాణలో ఎండిన పొలాలు.. ఫ్లోరైడ్ భూతం పీడ
పాతిక లక్షల ఎకరాలకు పారాల్సిన కృష్ణమ్మ
ఏడు లక్షల ఎకరాలకు నీరదటమే గగనం
కుంట పొలాన్నీ తడుపని శ్రీశైలం జలాలు
భీమా ధీమా దక్కని పాలమూరు పొలాలు
నీళ్లు దోచుకుపోతున్న పోతిరెడ్డిపాడు
ఇంకా కుంటి నడకనే శ్రీశైలం ఎడమ కాలువ
లక్షల కోట్లలో నష్టపోయిన తెలంగాణ రైతు
కృష్ణమ్మనుంచి మన వాటా ప్రతి చుక్క రావాల్సిందే

ఒక అన్యాయం మూడు జిల్లాలు వట్టిపోయేలా చేసింది! పనిగట్టుకుని రచించిన ఒక పథకం.. న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులను తెలంగాణకు కాకుండా చేసింది! కరడుగట్టిన వివక్ష.. ఒక జిల్లాను తరతరాలు పీడించే ఫ్లోరైడ్ రక్కసి కోరల మధ్యకు నిర్దాక్షిణ్యంగా విసిరిపారేసింది! సమైక్య పాలకుల పట్టరానితనం.. దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఒక జిల్లాకు జిల్లానే వలసబాట పట్టించింది! కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు కబ్జా కథ చదివాం! ఇది ఆ కబ్జా నేపథ్యంలో శ్రీశైలానికి ఇవతలివైపున తెలంగాణలో తలెత్తిన మహా మానవ సంక్షోభానికి మచ్చుతునకలివి! గండికొట్టుకుని మరీ తరలించుకుపోయిన నీటితో ఆంధ్ర రిజర్వాయర్లు నిండి.. అక్కడ పంటలు పండితే తెలంగాణ పొలాలు ఎండిపోయాయి! కృష్ణా జలాలపై ప్రథమ హక్కులుండి.. హక్కు ప్రకారమే కనీసం పాతిక లక్షల ఎకరాలను తడపాల్సిన జలాలు.. ఏడు లక్షల ఎకరాలను తడిపేసరికే డస్సిపోతున్నాయి! ఇది దగా పడ్డ తెలంగాణ కథ! బిరబిరా తరలిపోతున్న కృష్ణమ్మను చూసి తెల్లబోయి…

View original post 1,148 more words

Leave a comment